కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసిండు

కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసిండు

సూర్యపేట: ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం  జిల్లాలో పాదయాత్ర  ముగించుకొని  సూర్యాపేటలో అడుగుపెట్టిన షర్మిల కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్  పాలనలో రాష్ట్రం అప్పులపాలయిందన్నారు. జీతాలకు కూడా సర్కారు దగ్గర డబ్బులు లేవని, మద్యంపై వచ్చే ట్యాక్స్ తోనే ప్రభుత్వం నడుస్తోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు.  కేసీఆర్ ను గద్దె దించడానికే తాను పార్టీ పెట్టినట్లు చెప్పిన షర్మిల... అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తెస్తానని చెప్పారు. పేద,  బడుగు బలహీన  వర్గాల కోసం వైఎస్ఆర్ అనేక  సంక్షేమ పథకాలు  పెట్టి... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు.