కేసీఆర్ దొరల పాలన తేవాలనుకుంటున్నడు 

కేసీఆర్ దొరల పాలన తేవాలనుకుంటున్నడు 

హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ మండిపడింది. నాయకుడి తీరును బట్టి ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ స్పష్టం చేసింది. కేసీఆర్ దొర కాబట్టి రాజ్యాంగాన్ని మార్చి.. దొరల పాలన తేవాలనుకుంటున్నాడని ట్వీట్ చేసింది. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కానట్లయితే అది చెడ్డ ఫలితాన్నే ఇస్తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది’ అనే అంబేడ్కర్ కోట్ ను ఆ ట్వీట్ కు జత చేసింది. 

మరిన్ని వార్తల కోసం:

మధురలో కృష్ణుడి ఆలయం కట్టండి చూద్దాం

జనాల జోలికోస్తే ఊరుకునేది లేదు

సీఎంకు సవాల్ చేసిన గవర్నర్