మధురలో కృష్ణుడి ఆలయం కట్టండి చూద్దాం

మధురలో కృష్ణుడి ఆలయం కట్టండి చూద్దాం

లక్నో: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. పార్టీలు, నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఓటర్ల మనసులు గెల్చుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై మాటల తూటాలు ఎక్కుపెడుతున్నారు. మరో వారంలో తొలి విడత ఎలక్షన్స్ జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీల మధ్య డైలాగ్ వార్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా అఖిలేశ్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేస్తామని అఖిలేశ్ చేసిన కామెంట్లపై బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కూడా అఖిలేశ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామాలయాన్ని మరింత వేగంగా, మెరుగ్గా నిర్మిస్తుందన్నారు. తమ పార్టీ పవర్ లోకి వస్తే రామాలయ విరాళాల్లో జరుగుతున్న చోరీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఘాటుగా స్పందించారు. అయోధ్య కాదు గానీ.. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో ఆలయాన్ని కట్టి చూపించాలని అఖిలేశ్ కు ఆయన సవాల్ విసిరారు. కృష్ణుడి గుడి కడతామని గంగా నది నీళ్లపై అఖిలేశ్ ప్రమాణం చేయాలని గిరిరాజ్ ఛాలెంజ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

చింతామణి నాటక నిషేధంపై హైకోర్టు సీరియస్