నా జీవితం  తెలంగాణకు అంకితం

నా జీవితం  తెలంగాణకు అంకితం
  • ప్రజలకు అండగా, కేసీఆర్‌‌కు ఆల్టర్నేటివ్‌గా ఉండాలనే పార్టీ పెట్టిన
  • ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిల
  •  వైఎస్సార్‌‌లా ప్రజా సేవ చేసేందుకే పవర్ కోరుకుంటున్న
  • అధికారం ఉంటేనే ప్రజల జీవితాలను మార్చవచ్చు
  • సీఎం అయ్యాక కేసీఆర్.. నియంతలా మారిండు
  • ప్రజల్ని పట్టించుకోడు.. మాట నిలబెట్టుకోడు.. దళితుల్ని అణచివేస్తుండని ఫైర్

హైదరాబాద్, వెలుగు:తన జీవితం తెలంగాణకు అంకితమని వైఎస్సార్‌‌‌‌‌‌‌‌టీపీ చీఫ్ షర్మిల చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆల్టర్నేట్‌‌‌‌‌‌‌‌గా ఉండేందుకే పార్టీ పెట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నియంతలా మారిపోయారని విమర్శించారు. సునీల్ నాయక్ అనే నిరుద్యోగి ఆత్మహత్య తనను కలచివేసిందని, నోటిఫికేషన్లు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకే దీక్షలు చేస్తున్నానని చెప్పారు. పాదయాత్రలు చేస్తే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రాలేమని.. ప్రజలు ఓట్లు వేస్తేనే వస్తామని అన్నారు. శనివారం ‘వీ6 వెలుగు’ ఇంటర్వ్యూలో షర్మిల పలు అంశాలపై మాట్లాడారు.

 

మహిళల పరిస్థితి దారుణం

కేసీఆర్ పాలనలో మహిళలు, పిల్లల పరిస్థితి దారుణంగా తయారైందని షర్మిల అన్నారు. ‘‘ఆడ పిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. లిక్కర్, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. వాటి ఫలితమే రేప్‌‌‌‌‌‌‌‌లు, మర్డర్లు. మత్తు ప్రభావంతో చిన్నారులపై, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మహిళలపై క్రైమ్ రేట్ 300 శాతం పెరిగినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి” అని అన్నారు. సైదాబాద్‌‌‌‌‌‌‌‌లో చిన్నారిపై ఘోరమైన అకృత్యం జరిగితే.. కనీసం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్ కూడా స్పందించలేదని మండిపడ్డారు. కరోనాను దరిద్రంగా హ్యాండిల్ చేశారు.
కరోనాను సీఎం కేసీఆర్ చాలా దరిద్రంగా హ్యాండిల్ చేశారని షర్మిల విమర్శించారు. కనీసం టెస్టులు చేయడానికి కూడా ఆయన ఇష్టపడలేదని ఆరోపించారు. తెలంగాణలో ఏం జరుగుతున్నదోనని రీసెర్చ్ చేశానని, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందని గ్రహించానని చెప్పారు. ‘‘ఆల్టర్నేటివ్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ లేకనే కేసీఆర్ రెండోసారి గెలిచారని నా ఫ్రెండ్, స్ర్టాటజిస్ట్ ఒకరు చెప్పారు. నాకు కూడా అదే నిజం అనిపించింది. అందుకే ప్రజలకు అండగా, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని నిర్ణయించుకుని పార్టీ ప్రారంభించాను. నా జీవితాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను” అని వెల్లడించారు.

అలాంటి వాళ్లు నాకెందుకు?

తమ పార్టీలోకి రావాలని ఎవరినీ ఆహ్వానించలేదని షర్మిల చెప్పారు. గతంలో వైఎస్‌‌‌‌‌‌‌‌తో కలిసి పని చేసిన కొందరు నేతలు రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌గా ఉండలేకపోయారని.. ప్రజలకు ధైర్యం ఇవ్వలేకపోయారని.. అలాంటి వాళ్లు తనకెందుకని ప్రశ్నించారు. ‘‘అందుకే వాళ్లను పిలవలేదు. జనాలకు అండగా ఉండే వాళ్లు  నాకు కావాలి. అలాంటి వాళ్లను జనాల నుంచే తయారు చేస్తాం” అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఆల్టర్నేట్ అయితే.. ప్రజలకు ఆ పార్టీలపై నమ్మకం ఉంటే.. కేసీఆర్ రెండోసారి ఎందుకు గెలిచే వారని ప్రశ్నించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ బీ టీమ్‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్ పార్టీ తయారైందని, కేసీఆర్ ఏం చెబితే ఆ పార్టీ వాళ్లు అది చేస్తారని విమర్శించారు. ‘‘కేసీఆర్ జుట్టు బీజేపీ జాతీయ నేతల చేతిలో ఉంది. అందుకే ఆ పార్టీతో ‘ఢిల్లీలో దోస్తాన్, గల్లీలో దుష్మన్’ తీరుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు” అని అన్నారు. 

వైఎస్సార్ బలం.. ప్రజలే బలగం

‘‘వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ. మా బలం వైఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆయన అభిమానులు, ఆయన పెట్టిన పథకాల లబ్ధిదారులే మా బలగం. అందరినీ ఏకం చేసి ప్రభంజనం సృష్టిస్తం. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తం” అని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. తాను పవర్ కోసమే తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అయితే కేసీఆర్ తీరుగా నియంత పాలన చేసేందుకు కాదన్నారు. తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌‌‌‌‌‌‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘‘రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఇంట్రస్ట్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. ఒకే ప్రాంతీయ పార్టీ రెండు వేర్వేరు రాష్ట్రాల కోసం పనిచేయడం కష్టం. అది అర్థం చేసుకునే జగన్ ఏపీకి పరిమితం అయ్యారు. మా పార్టీతో ఆయనకు సంబంధం లేదు” అని చెప్పారు.

ప్రజల్ని రెచ్చగొట్టేందుకే నీళ్ల గొడవ

నీటి సమస్య లేకపోతే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భావోద్వేగాలు రెచ్చగొట్టే అంశమంటూ ఉండదని షర్మిల అన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా జనాల్లో సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను రగిల్చేందుకు ఈ అంశాన్ని వాడుకుంటారని ఆరోపించారు. ‘‘జగన్, కేసీఆర్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. మా ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేస్త” అని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నియంతలా మారిపోయారని విమర్శించారు. ‘‘సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌కు పోడు.. మంత్రులు, ఎమ్మెల్యేలను కలవడు..  ప్రజలను పట్టించుకోడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోడు. దళితులను అణచివేస్తున్నాడు. ఇవన్నీ దొరల పొకడలే కదా? అందుకే ఆయన్ను దొర, నియంత అంటున్న” అని అన్నారు. 

రాజన్న రాజ్యం.. ఓ బ్రాండ్

రాజన్న రాజ్యం అనేది ఒక బ్రాండ్ అని షర్మిల చెప్పారు. ‘‘ఆరోగ్యశ్రీ, 108, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనారిటీ రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సహా ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ తీసుకొచ్చారు. ఆయన తెచ్చిన స్కీమ్‌‌‌‌‌‌‌‌ల వల్ల లక్షలాది మంది లబ్ధి పొందారు. ఇప్పటికీ వాళ్లు వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలచుకుంటున్నారు. ‘ఆయన వల్లే చదువుకున్నాం.. ఆయన వల్లే ఇలా స్థిరపడ్డాం’ అని ఎంతోమంది చెబుతున్నారు. ఆ సంక్షేమమే ప్రజలకు అవసరం. అదే రాజన్న రాజ్యం” అని వివరించారు. వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ వ్యతిరేకి కాదని షర్మిల అన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయనే పెట్టించారని చెప్పారు. ‘‘తెలంగాణలో 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను వైఎస్ కట్టించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆయన తర్వాత వచ్చిన పాలకులు 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను పక్కనపెట్టేశారు. ఇదంతా వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేరు రాకుండా చేసిన కుట్రలో భాగం. వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిందే. ఆయన అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ఉంటారు.

ప్రశాంత్ కిషోర్ వస్తరు

‘‘ప్రశాంత్ కిషోర్ నాకు మంచి ఫ్రెండ్, సోదరుడు. సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పటిదాకా ఆయన ఇక్కడ లేరు. ఇక ముందు ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయినట్టే.. ఇక్కడా సక్సెస్ అవుతారు” అని షర్మిల చెప్పారు.