నా భర్తకు విషమిచ్చి చంపేశారు..అలెక్సీ నావల్నీ భార్య యూలియా

నా భర్తకు విషమిచ్చి చంపేశారు..అలెక్సీ నావల్నీ భార్య యూలియా

మాస్కో: రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ విషప్రయోగం వల్లే చనిపోయాడని అతని భార్య యూలియా నావల్నాయా అన్నారు. ఈమేరకు బుధవారం సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ‘‘నావల్నీ బయోలాజికల్ శాంపిల్స్‌‌‌‌ను రెండు వేర్వేరు దేశాల్లోని ల్యాబ్‌‌‌‌లకు టెస్టుల కోసం పంపించాం. 

నావల్నీ విషప్రయోగం వల్లే చనిపోయారని అవి రెండూ నిర్ధారించాయి. కానీ రాజకీయ కారణాల వల్ల రిపోర్టులను బయటపెట్టడం లేదు. వాటిని బయటపెట్టాలి” అని యూలియా డిమాండ్ చేశారు. ‘‘నావల్నీకి విషమిచ్చి చంపేశారు. ఈ నిజం ప్రపంచానికి తెలియాలి” అని పేర్కొన్నారు.