
తెలుగింటి పాటల్ని, కొత్త గొంతుల్ని పరిచయం చేస్తోంది ‘సరిగమప’ తెలుగు షో. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రతివారం కొత్త గెస్ట్‌లతో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘మెంటార్స్ ఛాలెంజ్ రౌండ్’ లో అతను కనిపించబోతున్నాడు. యువన్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది జీ తెలుగు. తాను సంగీతం అందించిన ‘పంజా’ సినిమా టైటిల్ సాంగ్ పాడుతూ కంటెస్టెంట్లు, ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేశాడు యువన్ శంకర్ రాజా. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల 27 రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.