నీ లక్ష్యం 400.. బుమ్రాకు యువీ టార్గెట్

నీ లక్ష్యం 400.. బుమ్రాకు యువీ టార్గెట్

చండీగఢ్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ 600 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి పేసర్‌‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా అండర్సన్‌కు టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా విషెస్ చెప్పాడు. ‘మరపురాని ఘనతను అందుకున్నందుకు జిమ్మీకి అభినందనలు. నీ మక్కువ, పౌరుషం, ప్రయాణం అత్యద్భుతం. చియర్స్, నీ భవిష్యత్‌కు బెస్ట్ విషెస్’ అని బుమ్రా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు టీమిండియా వరల్డ్‌కప్‌ల హీరో యువీ రెస్పాండ్ అయ్యాడు. బుమ్రాకు ఓ సవాల్ విసిరాడు. కనీసం 400 వికెట్లు సాధించాలని, అదే నీ టార్గెట్‌ అంటూ బుమ్రాకు లక్ష్యం ఫిక్స్ చేశాడు.