జాంబియా యువతికి హైదరాబాద్ లో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. డ్రగ్స్ కేసులో జాంబియా మహిళకు శిక్ష ఖరారైంది. వివరాల్లోకి వెళితే..
2021లో జాంబియా నుంచి మహిళ డ్రగ్స్ తీసుకొచ్చింది. సూట్ కేస్ రాడ్లలో 8,050 గ్రాముల హెరాయిన్ ను మహిళ తీసుకొస్తుండగా.. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ 8 కిలోలకు పైగా ఉన్నాయని.. అవి రూ. 50 కోట్ల విలువచేసే డ్రగ్స్ అని అధికారులు తెలిపారు. నిందితురాలని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి.. జైలుకు తరలించారు డీఆర్ఐ అధికారులు.
విచారణలో జాంబియా మహిళలను ఎల్బీనగర్ కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఈరోజు(ఫిబ్రవరి 01) ఆమెకు 14 సంవత్సరాల కఠిన కరాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధించింది ఎల్బీనగర్ కోర్టు.