
కర్ణాటక పొలిటీషియన్ జమీర్ అహ్మద్ కొడుకు జైద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తిలకరాజ్ బల్లాల్ నిర్మించిన చిత్రం ‘బనారస్’. ‘బెల్ బాటమ్’ ఫేమ్ జయతీర్థ దర్శకుడు. సోనాల్ మోంటెరో హీరోయిన్. నవంబర్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ‘నాంది’ నిర్మాత సతీష్ వర్మ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జైద్ మాట్లాడుతూ.. ‘ఇదొక మిస్టీరియస్ మెచ్యూర్డ్ లవ్ స్టొరీ. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. మేము చేసిన కొత్త ప్రయోగం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అన్నాడు. మనసుల్లో నిలిచిపోయే క్యారెక్టర్ చేశానంది సోనాల్.
సతీష్ మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితమే జైద్‌ని పరిచయం చేద్దామని ప్లాన్ చేస్తే కుదరలేదు. ఇంత మంచి సినిమాతో అతను హీరోగా ఇంట్రడ్యూస్ కావడం హ్యాపీ. టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ కూడా ఉంది. కంటెంట్ నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నా’ అన్నారు.