లక్ ఫేవర్స్ ది బ్రేవ్

లక్ ఫేవర్స్ ది బ్రేవ్

సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్. ఎస్.ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. 

 ఒక చేతిలో పెన్, మరో చేత్తో బ్యాగ్ భుజాన వేసుకుని సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నడుస్తూ కనిపించాడు సత్యదేవ్.  బ్యాక్‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరెన్సీ నోట్లను చూపించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సత్యరాజ్ కీలకపాత్ర  పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంగీతం అందిస్తున్నాడు.