సోనీతో విలీనాన్ని ముగిస్తామన్న జీ

సోనీతో విలీనాన్ని ముగిస్తామన్న జీ

 న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్‌‌‌‌వర్క్స్ ఇండియాతో విలీనానికి తాము "కమిట్" అయ్యామని  లావాదేవీని  ముగిస్తామని జీ గ్రూపు మంగళవారం తెలిపింది.   విలీన ఒప్పందం ప్రతిపాదనను సోనీ ఉపసంహరించుకోనుందని వార్తలు రావడంతో   ఈ వివరణ ఇచ్చింది. "మా కంపెనీ సోనీతో విలీనానికి కట్టుబడి ఉంది. విలీనాన్ని విజయవంతంగా ముగించే దిశగా పని చేస్తూనే ఉంటాం" అని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది.

 రెండు పార్టీల మధ్య విలీన సహకార ఒప్పందం డిసెంబర్ 22, 2021న కుదిరింది.  విలీన సంస్థకు ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా నాయకత్వం వహించడంపై ఇరు పార్టీలు ఇంకా ఒక అంగీకారానికి రాలేదు. నిధుల మళ్లింపు కేసు కారణంగా సెబీ ఆయనపై నిషేధించడంపై సోనీ ఆందోళన వ్యక్తం చేసింది.  జపాన్‌‌‌‌లో   కార్పొరేట్ రూల్స్​ కఠినంగా ఉన్నందున  విలీన సంస్థకు గోయెంకా నాయకత్వం వహించడం సోనీకి నచ్చడం లేదని తెలుస్తోంది.