ప్రిగోజిన్‌ మృతి వెనుక పుతిన్​హస్తం : జెలెన్‌ స్కీ

ప్రిగోజిన్‌ మృతి వెనుక పుతిన్​హస్తం : జెలెన్‌ స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) మరణం వెనుక పుతిన్‌ హస్తం ఉందని జెలెన్‌ స్కీ ఆరోపించారు. అయితే.. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. కీవ్‌లో శుక్రవారం (సెప్టెంబర్​ 8వ తేదీన) జరిగిన సమావేశంలో జెలెన్‌స్కీ  ఈ కామెంట్స్ చేశారు.

కొన్ని నెలల క్రితం రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. కిరాయి సైన్యంగా పేరున్న వాగ్నర్‌ గ్రూప్‌నకు ప్రిగోజిన్‌ నాయకత్వం వహించాడు. పుతిన్‌, ప్రిగోజిన్‌ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్‌ అధ్యక్షులు అలెగ్జాండర్‌ లుకషెంకో చెప్పారు. ఆ తరువాత కొద్ది రోజులకే ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించాడు. ఇప్పటికీ ఆయన మృతిపై అనేక ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ రక్షణగా ఉన్న బాడీగార్డులు, పైలట్లు సహా ఈ ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందారు.