లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్స్ లో..జెప్టో టాప్

లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్స్ లో..జెప్టో టాప్

న్యూఢిల్లీ: క్విక్​ కామర్స్​ ప్లాట్​ఫారమ్​ జెప్టో వరుసగా మూడోసారి 2025 లింక్డ్​ఇన్​ టాప్​ స్టార్టప్స్​ ఇండియా లిస్ట్​ మొదటి స్థానం దక్కించుకుంది. ఎంటర్​ప్రైజ్​ క్లౌడ్​ స్టోరేజ్​ సంస్థ లూసిడిటీ (2), పది నిమిషాల ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫాం స్విష్​ (3) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

ఉద్యోగుల వృద్ధి, సభ్యుల భాగస్వామ్యం, ఉద్యోగాలపై ఆసక్తి, టాప్​ ట్యాలెంట్​ ఆకర్షించే సామర్థ్యం ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు. ఈ లిస్టులో క్విక్​ కామర్స్​, ఏఐ​-నేటివ్​ ప్లాట్​ఫారాలు, ప్రత్యేక ఫిన్​టెక్​ సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.  టాప్– 20 స్టార్టప్స్​లో బెంగళూరు నుంచి 9 కంపెనీలు ఉన్నాయి. 

పూణేకు చెందిన ఈమోటోరాడ్​ (9), హైదరాబాద్​కు చెందిన భాంజు (7) జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని లింక్డ్​ఇన్​​ తెలిపింది.