ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు

ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు

దేశవ్యాప్తంగా లోక్ సభ 2024 ఎన్నికల హడావిడీ కొనసాగుతుంది. 100శాతం ఓటింగ్ నమోదు చేయడానికి ప్రభుత్వ అధికారులు కృషి చేస్తున్నారు. ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటేయ్యడానికి రాలే..దీంతో అక్కడ జీరో పర్సెంట్ ఓటింగ్ నమోదైంది. ఎందుకంటే.. ఈస్ట్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ENPO)  పిలుపుమేరకు అక్కడి గిరిజన తెగలు ఎలక్షన్స్ బహిష్కరించాయి. 

ఫ్రాంటియర్ నాగాలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని వాళ్ల డిమాండ్.. అది 2010 నుంచి కొనసాగుతుంది. ENPOలో ఏడు గిరిజన సంఘాలు ఉన్నాయి. వారు ప్రత్యేక పాలనా రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా.. 20 నియోజకవర్గాలు ఆ ప్రాంతానికి చెందినవే. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన మొదటి దశ ఎన్నికల కోసం 738 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.  కానీ ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. దీంతో అక్కడ జీరో పర్సెంట్ ఓటింగ్ నమోదైంది.