జెరోధా సీఈఓ నితిన్‌ కామత్‌కు‘ఎంటర్‌‌ప్రెనూర్ ఆఫ్‌ ది ఇయర్’ అవార్డ్‌

జెరోధా సీఈఓ నితిన్‌ కామత్‌కు‘ఎంటర్‌‌ప్రెనూర్ ఆఫ్‌ ది ఇయర్’ అవార్డ్‌

న్యూఢిల్లీ: మార్కెటింగ్, అడ్వర్టయిజ్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్‌‌‌‌ ఈక్విటీ కంపెనీల నుంచి ఫండ్స్ సేకరించనూ లేదు. అయినప్పటికీ బ్రోకరేజి ఇండస్ట్రీలో టాప్‌‌‌‌లో జెరోధా కొనసాగుతోంది. కంపెనీని కొత్త శిఖరాలకు చేర్చిన జెరోధా సీఈఓ నితిన్ కామత్‌‌‌‌కు 2022 కి గాను ఈటీ ‘ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెనూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ వరించింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌‌‌‌ను ఆయన అందుకున్నారు.

ప్రభుత్వ చర్యలు, పాలసీలు తన బిజినెస్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌గా ఉన్నాయని నితిన్ కామత్ అన్నారు. యూపీఐ, ఆధార్‌‌‌‌‌‌‌‌ ఈ–కైవైసీ వంటివి జెరోధా బిజినెస్‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు సాయపడ్డాయని వెల్లడించారు. ట్రెడిషనల్ విధానాలను ఫాలో అవ్వకుండానే సక్సెస్‌‌‌‌ఫుల్ బిజినెస్‌‌‌‌ను క్రియేట్ చేయొచ్చనడానికి జెరోధా ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.కామన్‌సెన్స్‌‌‌‌ ఉండి, సమస్యలను పరిష్కరించాలనుకునే యావరేజ్ వ్యక్తి కూడా సక్సెస్‌‌‌‌ఫుల్ బిజినెస్‌‌‌‌ను క్రియేట్‌‌‌‌ చేయగలరని అన్నారు.కస్టమర్లు ఆసక్తి కోల్పోకుండా చూసి, ఇతరుల కంటే ముందుంటే బిజినెస్‌‌‌‌ గ్రోత్‌‌‌‌కు రెగ్యులేషన్సే సాయపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జెరోధాకు 1.14 కోట్ల  కస్టమర్లు ఉన్నారని వివరించారు.