నాకు గుండెపోటు వచ్చింది: జెరోధా సీఈవోకు నితిన్ కామత్

నాకు గుండెపోటు వచ్చింది:  జెరోధా సీఈవోకు నితిన్ కామత్

తాను గుండెపోటుకు గురైనట్లు జెరోధా సీఈవో నితిన్ కామత్ తెలిపారు. సుమారు 6 వారాల క్రితం తనకు తేలికపాటి స్ట్రోక్ వచ్చిందని ట్వీట్ చేశారు. నాన్న చనిపోవడం, సరిగా నిద్రలేకపోవడం,అలసట, డీహైడ్రేషన్ ,ఎక్కువ పనిచేయడం వంటివి కారణాలు కావొచ్చని తెలిపారు.  పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలలు పట్టొచ్చు.. ఫిట్ గా ఉన్నప్పటికీ ఇలా జరగడం చూసి ఆశ్వయర్యపోయానని  ట్విట్టర్లో తెలిపారు. 

ముఖంలో చాలా మార్పులు కనిపించాయి. కొన్ని రోజులు మాట్లాడటం, రాయడానికి రాలేదు. మైండ్ సరిగా పనిచేయలేదు.ఇపుడు కాస్త బెటర్ అని చెప్పారు.  మళ్లీ ట్రెడ్ మిల్ కౌంట్ పెంచుతున్నానని తెలిపారు. 

 జెరోధా సీఈవో కామత్ రెస్ట్ తీసుకోవాలని భారత్ పే ఫౌండర్ షార్క్  ట్యాంక్ ఇండియా ఇన్వెస్టర్ ఆష్ నీర్  గ్రోవర్. మీ నాన్న చనిపోయిన బాధతో ఇలా జరిగినట్టుంది..మా నాన్న  చనిపోయినప్పుడు కూడా నాకు ఇలా జరిగింది..నువ్వు బ్రేక్ తీసుకో అని సూచించారు.