జింబాబ్వే పర్యటనకు టీమిండియా..ఐదు టీ20 మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటన

జింబాబ్వే పర్యటనకు టీమిండియా..ఐదు టీ20 మ్యాచ్‌లకు షెడ్యూల్ ప్రకటన

టీమిండియా కొత్త షెడ్యూల్ ఖారారైంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేలో అడుగుపెట్టనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్  మొత్తం 5 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. భారత జట్టు జూలైలో 5 T20Iల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుందని జింబాబ్వే క్రికెట్ (ZC), నేడు (ఫిబ్రవరి 6, 2024) ప్రకటించింది.  జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6,7, 10, 13, 14 తేదీల్లో జరుగుతాయి.
 
జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ టూర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. T20I సిరీస్‌కు జూలైలో భారత్‌కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది మాకు అతి పెద్ద అంతర్జాతీయ సిరీస్. జింబాబ్వే పర్యటనకు కట్టుబడి ఉన్నందుకు BCCIకి నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. ప్రపంచ క్రికెట్ కమ్యూనిటీకి సహకారం అందించడంలో బీసీసీఐ ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో జింబాబ్వే క్రికెట్‌కు మా మద్దతు అవసరం. అని అయన అన్నారు. 

8 ఏళ్ల తర్వాత జింబాబ్వేలో భారత్‌ పర్యటించడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా భారత్ 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఇప్పటివరకు మూడు సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన క్రికెట్ జట్టు.. రెండు సార్లు సిరీస్ గెలిచింది. 2015 లో జరిగిన సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్ లాడగా.. 5 టీ20ల్లో విజయం సాధించింది. మరో రెండు టీ20 ల్లో ఓటమి పాలైంది.