గచ్చిబౌలి, వెలుగు : గంజాయి అమ్ముతున్న డెలివరీ బాయ్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ అంజయ్యగర్ లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న నవీన్(28) జోమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఈజీ మనీ కోసం గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేశాడు. భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయిని కొని సిటీకి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. దీని గురించి తెలుసు కున్న రాయదుర్గం పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.56 వేల విలువైన కిలో 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.