జొమాటోకు రూ. 11.82కోట్ల జీఎస్టీ టాక్స్ నోటీసులు

జొమాటోకు రూ. 11.82కోట్ల జీఎస్టీ టాక్స్ నోటీసులు

న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటోకు రూ. 11.82 కోట్ల టాక్స్ డిమాండ్, పెనాల్టీ ఆర్డర్ జారీ చేశారు జీఎస్టీ అధికారులు. 2017 జూలై నుంచి 2021 మార్చి వరకు భారత దేశం వెలుపల దాని అనుబంధ సంస్థలకు జొమాటో అందించిన ఎగుమతి సేవలకుగాను జీఎస్టీ పన్ను చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

రూ. 5,90,94,889జీఎస్టీ, దానికి వర్తించే వడ్డీ రూ. 5,90,94,889 జరిమానాతో కలిపి మొత్తం రూ.11.82 కోట్లు చెల్లించాలని  గురుగ్రామ్ లోని సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

జొమాటో తన విదేశీ అనుబంధ సంస్థలకు ఎగుమతి చేసే సేవలు, జీఎస్టీ కింద అయితే ఈ ఆర్డర్ను సవాల్ చేయనున్నట్లు జొమాటో తన రెగ్యులేటరీ ఫైలింగ్లో ప్రకటించింది.