
న్యూఢిల్లీ: జొమాటో తన గ్రోసరీ డెలివరీ సర్వీస్‌లను ఈ నెల 17 నుంచి ఆపేస్తోంది. ఆర్డర్లను తీసుకొని సరుకులను అందించడంలో ఇబ్బందులున్నాయని, కస్టమర్లకు సరియైన టైమ్‌లో డెలివరీ చేయలేకపోతున్నామని ప్రకటించింది. కానీ, గ్రోఫర్స్ గ్రోసరీ డెలివరీ సెగ్మెంట్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. గ్రోఫర్స్‌ను జొమాటో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో యాప్‌లో సపరేట్ ఆఫర్ చేస్తున్న గ్రోసరీ సర్వీస్‌లను నిలిపివేయాలని జొమాటో చూస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ‘కస్టమర్లకు బెస్ట్ సర్వీస్‌లను అందించాలని జొమాటో చూస్తుంది. మర్చంట్ పార్టనర్లు బాగుపడాలని ఆశిస్తాం. ప్రస్తుత మోడల్ వలన కస్టమర్లకు, మర్చంట్ పార్టనర్లకు లాభం ఉంటం లేదు. అందుకే గ్రోసరీ డెలివరీ సర్వీస్‌లను ఈ నెల 17 నుంచి నిలిపివేస్తున్నాం’ అని కంపెనీ ఉద్యోగులకు రాసిన లెటర్‌లో పేర్కొంది. ఇన్వెంటరీ లెవెల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, దీంతో ఆర్డర్లను ఫుల్‌ఫిల్ చేయడంలో అంతరాయం ఏర్పడుతోందని వివరించింది.