జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్లాట్ ఫారం చార్జీలు 25శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చార్జీల పెంపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వర్తిస్తుందని తెలిపింది. మనం ఆన్లైన్లో చేసే ఒక్కో ఆర్డర్ కి చొప్పున ప్లాట్ ఫారం ఫీజ్ వసూలు చేస్తాయి ఫుడ్ డెలివరీ కంపెనీలు. డెలివరీ చార్జీలు కాకుండా అదనంగా ఈ ప్లాట్ ఫారం చార్జీలు వసూలు చేస్తుంటాయి ఫుడ్ డెలివరీ యాప్స్. జొమాటోలో అయితే, గోల్డ్ సర్వీస్ ని వాడే వారికి ఎలాంటి డెలివరీ చార్జీలు ఉండవు.

2023లో ప్లాట్ ఫామ్ చార్జీలు వసూలు చేయటం స్టార్ట్ చేసిన జొమాటో అప్పట్లో ఒక్కో డెలివరీకి రూ.2 వసూలు చేసేది. ఆ తర్వాత అక్టోబర్లో రూ.3, జనవరిలో రూ.4కు పెంచింది జొమాటో. ప్రస్తుతం రూ.4గా ఉన్న ఈ చార్జీలను రూ.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ సంస్థ. ఇటీవల వచ్చిన ట్యాక్స్ డిమాండ్ నోటీసులే ఈ చార్జీల పెంపునకు కారణంగా తెలుస్తోంది. చార్జీలు పెంచటంతో పాటు ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీసును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది జొమాటో.