ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఫీజు పెంచిన జొమాటో

ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఫీజు పెంచిన జొమాటో

న్యూఢిల్లీ: జొమాటో ఆర్డర్లపై వేస్తున్న ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఫీజును 25 శాతం  పెంచింది. ఇప్పటి వరకు ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై రూ.4  ఫీజు  వసూలు చేసే ఈ కంపెనీ, తాజాగా ఈ రేటును రూ. 5 కి పెంచింది. ప్రస్తుతానికి ఈ పెరిగిన రేటు హైదరాబాద్‌‌‌‌, ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, బెంగళూరు, ముంబై వంటి  సిటీల్లో అమల్లోకి వచ్చింది. స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై రూ.5 ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఫీజును వసూలు చేస్తోంది.  

ఇతర సిటీల నుంచి ఫుడ్ డెలివరీ చేయడానికి తీసుకొచ్చిన ‘ఇంటర్‌‌‌‌‌‌‌‌సిటీ లెజెండ్స్‌‌‌‌’ సర్వీస్‌‌‌‌లను జొమాటో తాత్కాలికంగా నిలిపేసింది. ఇవి పరిస్థితులకు తగ్గట్టు తీసుకునే బిజినెస్ నిర్ణయాలని కంపెనీ స్పోక్స్‌‌‌‌పర్సన్‌‌‌‌ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి 15 తర్వాత రూ.227.85 ట్యాక్స్ డిమాండ్ నోటీసులను జొమాటో అందుకుంది. మరోవైపు  క్యూ4 రిజల్ట్స్‌‌‌‌ను ప్రకటించడానికి కంపెనీ రెడీ అవుతోంది. వచ్చే నెలలో  ఫలితాలు వెలువడనున్నాయి.  కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో జొమాటోకి రూ. 138 నికర లాభం వచ్చిన విషయం తెలిసిందే.