లెజెండ్స్ సర్వీస్ మూసివేసిన జొమాటో

లెజెండ్స్ సర్వీస్ మూసివేసిన జొమాటో

ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీ జొమాటో లెజెండ్స్(ఇంటర్‌సిటీ ఫుడ్ డెలివరీ) సర్వీస్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ గురువారం ఎక్స్ వేదికగా ఇంటర్‌సిటీ ఫుడ్ డెలివరీ సర్వీస్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 10 సిటీల్లో ఐకానిక్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్స్ చేసుకునే వేసులు బాటు ఈ సర్వీస్ కల్పిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ ప్రారంభంలో నిలిపివేయబడింది. తర్వాత తక్కువ డెలివరీ టైమ్‌లైన్‌తో ఇతర నగరాల నుంచి ప్రీ-స్టాక్ చేయబడిన వస్తువులను డెలివరీ చేయడంపై దృష్టి సారించి జూలైలో తిరిగి ఈ సర్వీస్ ప్రారంభించారు.

CEO దీపిందర్ గోయల్ తన X పోస్ట్‌లో Zomato లెజెండ్స్‌ సర్వీస్ నిలిపివేస్తు్న్నామని తెలిపారు. మార్కెట్ కు తగ్గట్టుగా ఉత్పత్తులు రావడంలేదని ఆయన అన్నారు. అందుకే ఈ సర్వీస్ క్లోస్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ రంగంలోకి Zomato ప్రవేశానికి గుర్తుగా Paytm మూవీస్ మరియు ఈవెంట్‌ల టికెటింగ్ వ్యాపారాలను రూ.2వేల 034 కోట్లకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.