Zone Zero Fitness: వ్యాయామాల్లో కొత్త ట్రెండ్ జోన్ జీరో ఫిట్ నెస్.. తక్కువ శ్రమ.. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు

Zone Zero Fitness:  వ్యాయామాల్లో కొత్త ట్రెండ్ జోన్ జీరో ఫిట్ నెస్.. తక్కువ శ్రమ.. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు

వ్యాయామం ఆరోగ్యం ఎంతో మంచిది మనందరికి తెలుసు.. అయితే కొన్ని సార్లు వ్యాయామం కూడా ఒత్తిడితో కూడుకున్నదిగా మారుతుంది. జిమ్ కు సమయానికి వెళ్లడం, ఫ్రెష్ ఫిట్ నెస్ డ్రెస్ ధరించడం, కిలోమీటర్ల ట్రాక్ వాకింగ్.. ఇలా ఫిట్ నెస్ కు సంబంధించినవి ఒత్తిడి కలిగించొచ్చు.  తక్కువ  శ్రమ, ఒత్తిడి లేని ఫిట్ నెస్ కోరుకునే వారికి జోన్ జీరో ఫిట్ నెస్ బాగా  వర్కవుట్ అవుతుంది.. ప్రస్తుతం ఫిట్ నెస్ పద్దతుల్లో ఇది ట్రెండింగ్ లో ఉంది. 

జోన్ జీరో ఫిట్ నెస్.. ఇది రోటీన్ గా చేసే వ్యాయామాలకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక హార్ట్ రేట్ జోన్ శిక్షణ.ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది వ్యాయామం చేస్తూ హార్ట్ బీట్ ను ఫిట్ నెస్ ట్రాకర్ ద్వారా చెక్ చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ఛాతి బెల్డ్ ల ద్వారా హార్ట్ బీట్ చెక్ చేస్తారు. అయితే ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ జోన్ జీరో ఫిట్ నెస్ ద్వారా ఆరోగ్యకరమైన హార్ట్ బీట్ ను ఎటువంటి శ్రమ లేకుండా పొందవచ్చంటున్నారు నిపుణులు. 

ALSO READ : కలబంద మజ్జిగతాగితే.. రోగాలకు దూరంగా ఉంటారు

జోన్ జీరో ఫిట్ నెస్  అంటే..

జోన్ జీరో వ్యాయామం అనేది తక్కువ శ్రమతోకూడిన ఎక్సర్ సైజ్. ఇది శారీరక , మానసిక ఆరోగ్యం, ఆయుష్సును మెరుగుపర్చడంలో ఎంతో తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హార్ట్ బీట్ ను గరిష్ట స్థాయిలో 50శాతం కంటే తక్కువగా ఉంచుతుంది. 

శరీరాన్ని ఎక్కువ సమయం నిశ్చల స్థితిలో ఉంచకుండా, కూర్చోవడాన్ని తగ్గించే ప్రయత్నమే జోన్ జీరో ఫిట్ నెస్ లక్ష్యం. ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాయామం కాకుండా రోజువారీ కార్యక్రమాలను  పెంచడం అని గురుగ్రామ్ లోని సీకే బిర్లా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ తయల్ చెబుతున్నారు.

ALSO READ : నాన్ వెజ్ స్నాక్స్.. చికెన్ మెజెస్టిక్.. ఫిష్ బాల్స్.. గెస్ట్స్కు ఇవి పెట్టండి..

 జోన్ జీరో వ్యాయామం అంటే.. నెమ్మదిగా నడవడం లేదా భోజనం తర్వాత నడక, తేలికపాటి సాగతీత, ఇంటి పని, మీ డెస్క్ మొబిలిటీ వ్యాయామాలు, మెట్లు ఎక్కడం వంటివి అంటున్నారాయన. జోన్ జీరో ఫిట్ నెస్ రోజురోజు  ఆదరణ పెరుగుతోంది. దీనికి శాస్త్రీయ మద్దతు కూడా ఉందంటున్నారు  ఆరోగ్య నిపుణులు. నడక, నిలబడటం, ఇంటి పనులు వంటి రోజువారీ కార్యకలాపాల ద్వారా శక్తిని ఖర్చు చేయొచ్చంటున్నారు.