
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఆన్ లైన్ క్లాస్ లు, మీటింగ్ లు, వీడియో కాన్ఫరెన్స్ ల కోసం యాప్ లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటి వాడకంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. మీటింగ్ ల కోసం వాడే జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ కు సురక్షితం కాదని హెచ్చరించింది. ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. యూజర్ల సేఫ్టీ కోసం గైడ్ లైన్స్ రిలీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ లో బయటి వ్యక్తుల ఎంట్రీ, సైబర్ ఎటాక్, మలీసియస్ యాక్టివిటీని అడ్డుకునేందుకు గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.