జూమ్ కాంటాక్ట్ సెంటర్ ఇప్పుడు లోకల్.. ఆరు టెలికాం సర్కిళ్లలో కొత్త ఫీచర్లు!

జూమ్ కాంటాక్ట్ సెంటర్ ఇప్పుడు లోకల్.. ఆరు టెలికాం సర్కిళ్లలో కొత్త ఫీచర్లు!

జూమ్ కమ్యూనికేషన్స్ (Zoom Communications) భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, వ్యాపార సంస్థల కోసం  జూమ్ కాంటాక్ట్ సెంటర్ సేవలను విస్తరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రధాన సర్కిళ్లలో స్థానిక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

హైదరాబాద్, వెలుగు:జూమ్ కమ్యూనికేషన్స్ భారత్ లో సేవలను మరింత విస్తరించింది. జూమ్ కాంటాక్ట్ సెంటర్ కోసం స్థానిక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు టెలికాం సర్కిళ్లలో ఈ సేవలు లభిస్తాయి. దేశీయ నిబంధనలకు అనుగుణంగా ఏఐ ఆధారిత కస్టమర్ సేవలను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

వాయిస్, వీడియో, చాట్ వంటి విభాగాలను ఒకే చోట నిర్వహించుకోవచ్చని జూమ్ తెలిపింది. భారత మార్కెట్ లో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని డేటా సెంటర్ల ద్వారానే సేవలు అందుతాయి. దీనివల్ల వ్యాపార సంస్థలు కస్టమర్లకు మరింత వేగంగా నాణ్యమైన పరిష్కారాలు అందించే అవకాశం కలుగుతుందని కంపెనీ ప్రకటించింది.