బుల్లితెర యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుజాత(Zordar Sujata).. ప్రస్తుతం నటిగా సినిమాలు చేస్తున్నారు. ఆమె యాంకర్ గా చేసిన జోర్దార్ ప్రోగ్రాంనే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆమె జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh) ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2023లో వీరి వివాహం ఘనంగా జరగగా ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆమెకు సీమంతం వేడుకను నిర్వహించారు కుటుంబసభ్యులు. మర్చి 4 గురువారం రోజున జరిగిన ఈ వేడుకకు సంబందించిన ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ రాకేష్, సుజాత జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక సుజాత, రాకేష్ సినిమాల విషయానికి వస్తే.. సుజాత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక రాకేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాకేష్ దర్శకుడిగా మారి కేసీఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.