
వనపర్తి, వెలుగు: జిల్లాలో ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించాలని జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి సంత సందర్భంగా ఆయన హనుమాన్ టెకిడీలో మహిళలకు ఉచితంగా గన్నీ బ్యాగులను పంపిణీ చేశారు. వనపర్తికి చెందిన టైలర్ మన్యం వీటిని ఉచితంగా అందించినట్లు చెప్పారు. దుకాణాదారులు, చిరు వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని సూచించినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్ చైర్మన్ పలుస రమేశ్‌గౌడ్, కదిరే రాములు పాల్గొన్నారు.