జుకర్‌‌బర్గ్‌ సంపద 10 బిలియన్ డాలర్లు అప్​

జుకర్‌‌బర్గ్‌ సంపద 10 బిలియన్ డాలర్లు అప్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి క్వార్టర్‌‌‌‌లో మెటా  సేల్స్ రికార్డ్ లెవెల్‌‌కు చేరుకోవడంతో  కంపెనీ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ సంపద గురువారం 10 బిలియన్ డాలర్లు పెరిగింది. మెటా షేర్లు ఏకంగా 14 శాతం  పెరిగాయి.  జుకర్ బర్గ్ సంపద ప్రస్తుతం 87.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.  బ్లూమ్‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌‌లో ఆయన 12 వ ప్లేస్‌‌కి జంప్‌‌ చేశారు.

మెటావర్స్​కోసం భారీగా  ఖర్చు చేస్తుండడం, టెక్ కంపెనీలకు కలిసి రాకపోవడంతో 2022 లో మెటా షేర్లు 57 శాతం  మేర క్రాష్ అయ్యాయి. ఆయన సంపద 71 బిలియన్ డాలర్లు తగ్గింది.  వర్చువల్ రియల్టీ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్‌‌ వంటి సెగ్మెంట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని రిజల్ట్స్‌‌ ప్రకటన సమయంలో మెటా పేర్కొంది. కంపెనీ షేర్లు పెరగడానికి ఇదొక కారణం.