55 వేల బాటిళ్ల ట్యాబ్లెట్లను రీకాల్‌‌‌‌ చేస్తున్న జైడస్‌‌‌‌

55 వేల బాటిళ్ల ట్యాబ్లెట్లను రీకాల్‌‌‌‌ చేస్తున్న జైడస్‌‌‌‌

న్యూఢిల్లీ: కాళ్లు, చేతుల దగ్గర వచ్చే పుండ్లను (గౌట్‌‌‌‌) ట్రీట్‌‌‌‌ చేయడానికి వాడుతున్న జనరిక్ మెడిసిన్ కోల్చిసైన్‌‌‌‌ ట్యాబ్లెట్లను యూఎస్ నుంచి జైడస్ లైఫ్‌‌‌‌సైన్సెస్‌‌‌‌ రీకాల్‌‌‌‌ చేస్తోంది.  వీటి తయారీలో కొన్ని ఇంప్యూరిటీస్‌‌‌‌ను ఎఫ్‌‌‌‌డీఏ గుర్తించడంతో  55 వేల బాటిళ్లను రీకాల్ చేస్తోంది. యూఎస్ ఎఫ్‌‌‌‌డీఏ రిపోర్ట్ ప్రకారం, కంపెనీ సబ్సిడరీ జైడస్ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ (యూఎస్‌‌‌‌ఏ)  30 ట్యాబ్లెట్‌‌‌‌లు ఉన్న 21,936 బాటిళ్లను, 100 ట్యాబ్లెట్‌‌‌‌లు ఉన్న 33,096   బాటిళ్లను రీకాల్ చేస్తోంది.

వీటిని అహ్మదాబాద్‌‌‌‌లోని కంపెనీ ప్లాంట్‌‌‌‌లో తయారు చేశారు. జైడస్ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ (యూఎస్‌‌‌‌ఏ) వీటిని యూఎస్‌‌‌‌లో అమ్ముతోంది. జైడస్‌‌‌‌ లైఫ్‌‌‌‌సైన్సెస్ షేర్లు శుక్రవారం 0.47 శాతం నష్టపోయి  రూ.480 వద్ద ముగిశాయి.