క్రిస్మస్‌‌‌‌కు బిందుమాధవి దండోరా రిలీజ్

క్రిస్మస్‌‌‌‌కు  బిందుమాధవి దండోరా రిలీజ్


‘పిల్ల జమిందార్‌‌‌‌‌‌‌‌’  చిత్రంతో  హీరోయిన్‌‌‌‌గా ఆకట్టుకున్న బిందు మాధవి.. ఆ తర్వాత వరుస తమిళ సినిమాలతో బిజీ అయింది. అలాగే  కొన్ని  ఓటీటీ ప్రాజెక్ట్స్‌‌‌‌ చేసిన ఆమె కొంత గ్యాప్  తర్వాత  తెలుగులో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’.  మురళీకాంత్ దర్శకత్వంలో ర‌‌‌‌వీంద్ర బెన‌‌‌‌ర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బిందు మాధవితో పాటు   శివాజీ, నవదీప్, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా   డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో బిందు మాధవి  వేశ్య పాత్ర పోషిస్తోందని, ఎమోషనల్ టచ్‌‌‌‌తో ఉంటూ ఆలోచింపజేసేలా తన పాత్ర ఉంటుందని  దర్శకనిర్మాతలు తెలియజేశారు.  మార్క్‌‌‌‌ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.