
జెనీవా: కరోనా మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ హెచ్చరించారు. కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు ప్రారంభ దశలో ఉందన్నారు. వరల్డ్‌వైడ్‌గా డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపారు. కొవిడ్‌పై నిర్వహించిన ఎమర్జెన్సీ కమిటీ సమావేశంలో గెబ్రియోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కరోనా మూడో వేవ్ మొదలైంది. ఇప్పుడు మనం థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నాం. డెల్టా వేరియంట్ 111కు పైగా దేశాల్లో వ్యాపించింది. అతి త్వరలో ఇది ప్రమాదకరమైన కరోనా వేరియంట్‌గా మారొచ్చు’ అని గెబ్రియోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటూ, కరోనా రూల్స్‌ను పాటించాలని సూచించారు.