దేవుడి విగ్రహాన్ని కోర్టుకు తెమ్మంటరా?

దేవుడి విగ్రహాన్ని కోర్టుకు తెమ్మంటరా?
  • ఆగమ శాస్త్ర నియమాలు, భక్తుల మనోభావాలు అక్కర్లేదా
  • కుంభకోణం కోర్టు తీర్పుపై మద్రాస్ హైకోర్టు ఫైర్

చెన్నై: దేవుడి విగ్రహాల చోరీ కేసులో విచారణకు ఆలయంలో ప్రతిష్టించిన మూలవిరాట్​ను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుబట్టింది. ఆగమ శాస్త్ర నియమాలు, భక్తుల నమ్మకాలను కాదని విగ్రహాన్ని కోర్టులో హాజరు పరచాలనడంపై హైకోర్టు ఫైర్ అయింది. అవసరమైతే విచారణకు ప్రత్యేక అధికారిని నియమించి రిపోర్ట్ తెప్పించుకుంటే సరిపోయేది కదా అని అన్నది. తమిళనాడు రాష్ట్రం కుంబకోణంలోని పురాతన ఆలయంలోని దేవుడి విగ్రహం చోరీకి గురైంది. 

పోలీసులు ఎంక్వైరీ చేసి, విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి, ఆలయానికి అప్పగించారు. ఆలయ పూజారులు దాన్ని మళ్లీ తిరిగి యాగశాలలో ప్రతిష్ఠించి కుంభాభిషేకం కూడా నిర్వహించారు. జనవరి 6న కేసు విచారణలో భాగంగా కుంభకోణం కోర్డు జడ్జి విగ్రహాన్ని కోర్టుకు తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు విగ్రహాన్ని పెకిలించేందుకు ప్రయత్నించగా భక్తులు ఆగ్రహంతో అడ్డుకున్నారు. తర్వాతి రోజు మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సురేశ్​కుమార్ పై విధంగా స్పందించారు.