కరోనా పేషెంట్లకు ‘కాకా’ ఫౌండేషన్​ అండ

కరోనా పేషెంట్లకు ‘కాకా’ ఫౌండేషన్​ అండ

పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలో ఆరు ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు అందజేత

మంచిర్యాల, వెలుగు: కరోనా కష్టకాలంలో  పేషెంట్లకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ అండగా నిలుస్తోంది. సర్కారు హాస్పిటల్స్​లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు అవస్థలు పడుతున్న నేపధ్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్​ కోర్​ కమిటీ మెంబర్​ డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి తన తండ్రి కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ ద్వారా ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లు అందించడానికి ముందుకొచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్​ సెగ్మెంట్​పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, గోదావరిఖని, పెద్దపల్లి, ధర్మపురి గవర్నమెంట్​ హాస్పిటల్స్​కు ఆరు ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్లను అందించారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్​కు పది లీటర్ల కెపాసిటీ గల ఆక్సిజన్​ కాన్సెంట్రేటర్​ను ఇన్​చార్జి సూపరింటెండెంట్​ డాక్టర్​ రాధాకృష్ణకు బుధవారం  అందజేశారు. బెల్లంపల్లి ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కాన్సెంట్రేటర్​ను డొనేట్​ చేయడం అభినందనీయమని,   కరోనా కష్టకాలంలో  ఇవి  పేషెంట్ల ప్రాణాలు కాపాడుతాయని డాక్టర్​ రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ మునిమంద రమేష్, టౌన్​ ప్రెసిడెంట్​ కోడి రమేశ్, తాండూరు మండల ఇన్​చార్జి రెవెళ్లి రాజలింగు, మహిళా మోర్చా డిస్ట్రిక్ట్​వైస్​ ప్రెసిడెంట్​ గోమాస కమల తదితరులు పాల్గొన్నారు. నిరుడు లాక్​డౌన్​ టైమ్​లో కూడా కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా పేదలకు నిత్యావసరాల కిట్లు, ప్రభుత్వ వైద్యసిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేసి వివేక్​ వెంకటస్వామి పెద్దమనను చాటుకున్నారు.