మోడీ పర్యటన...కేసీఆర్‪పై సెటైరికల్ పోస్టర్లు

మోడీ పర్యటన...కేసీఆర్‪పై సెటైరికల్ పోస్టర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా మద్దతుదారులు ప్లకార్డులు, పోస్టర్లతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల కేంద్రానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు అదే తరహాలో ఒక పోస్టర్‌ వైరల్ గా మారింది. కానీ ఈ పోస్టర్ కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంది. ఈ పోస్టర్ లో'బండి సంజయ్ వచ్చాడు; మోడీ వస్తున్నాడు; కేసీఆర్ తప్పించుకున్నాడు; కేటీఆర్, కవిత జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అక్కడ కొన్ని పోస్టర్లు కనిపించాయి. దీంతో ఈ టాపిక్ ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పాలనకు సహకరించడం లేదన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.