చట్టసభల్లో సభ్యుల తప్పులను ఉపేక్షించొద్దు: ప్రధాని మోదీ

చట్టసభల్లో సభ్యుల తప్పులను ఉపేక్షించొద్దు: ప్రధాని మోదీ

ముంబై:  చట్టసభల్లో రూల్స్ ఉల్లంఘించే సభ్యులకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం, వారి ప్రవర్తనను సమర్థించడం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ముంబైలో జరిగిన 84వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీవోసీ)లో ఆయన వర్చువల్​గా మాట్లాడారు. ‘‘ఒకప్పుడు సభలో ఎవరైనా సభ్యుడు రూల్స్ ఉల్లంఘించి, ఆయనపై చర్యలు తీసుకుంటే.. సీనియర్ సభ్యులు అతనికి వివరంగా చెప్పేవారు. దీంతో ఆ సభ్యుడు మరోసారి తప్పు చేయకుండా ఉండేవారు.

కానీ ప్రస్తుతం కొన్ని పార్టీలు రూల్స్ ఉల్లంఘించిన సభ్యులకు మద్దతు పలుకుతున్నాయి. తప్పులను సమర్థిస్తున్నాయి. ఈ పరిస్థితి పార్లమెంటు, శాసనసభలకు మంచిది కాదు” అని మోదీ అన్నారు. యువ ప్రజాప్రతినిధులకు సభా కమిటీలలో ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నారు. ఇ–విధాన్, డిజిటల్ సంసద్ ద్వారా ‘ఒక దేశం, ఒకే లెజిస్లేటివ్​ ప్లాట్​ఫామ్’ అనే అంశంపై వర్క్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు.