మహారాష్ట్ర హోం మంత్రిపై హైకోర్టు జడ్జితో విచారణ

మహారాష్ట్ర హోం మంత్రిపై హైకోర్టు జడ్జితో విచారణ

ముంబై: హోం మంత్రి అనిల్ దేశ్‌‌ముఖ్‌‌పై వచ్చిన అవినీతి ఆరోపణలతో మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం అట్టుడుకుతోంది. అనిల్ దేశ్‌‌ముఖ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అనిల్‌‌పై వస్తున్న ఆరోపణలను రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ దేశ్‌‌ముఖ్ తెలిపారు. ‘నాపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపించాలని కేబినెట్ మీటింగ్‌లో‌‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరా. ఆయన దీనికి అంగీకరించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జరిగే ఈ విచారణతో ప్రజలకు నిజాలు తెలుస్తాయి’ అని నాగ్‌‌పూర్ ఎయిర్‌‌పోర్టులో దేశ్‌ముఖ్ చెప్పారు.