
నాగ్‌పూర్: వాక్ స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద తప్పుగా పరిగణించబడుతోందని సుప్రీం మాజీ సీజే శరద్ బాబ్డే అన్నారు. సీజేగా శుక్రవారం రిటైర్మెంట్ తీసుకున్న బాబ్డే.. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దుర్వినియోగానికి గురవుతోందని బాబ్డే ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టులో మరింత మంది మహిళా జడ్జిలను నియమించాల్సి ఉందని, కానీ ఇది ముందుకు కదలట్లేదన్నారు. ‘సీజేఐగా మహిళను నియమించాల్సిన సమయం ఆసన్నమైంది. కొలీజియంలో సుప్రీం సీజేగా కొందరు మహిళా అభ్యర్థుల పేర్లను పరిశీలించాం. కానీ దాన్ని అమలు పర్చలేకపోయాం. అదే సమయంలో అత్యున్నత ధర్మాసనంలో మహిళా జడ్జిల నియామకంలోనూ ఓ కొలీజియంగా మేం విఫలమయ్యాం’ అని బాబ్డే స్పష్టం చేశారు.