ఇతర దేశాలకే ఎక్కువ వ్యాక్సిన్‌‌లిచ్చాం 

ఇతర దేశాలకే ఎక్కువ వ్యాక్సిన్‌‌లిచ్చాం 

స్వదేశం కంటే ఇతర దేశాలకే ఎక్కువ కరోనా టీకాలను సరఫరా చేశామని యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ తెలిపింది. 2021 ఆరంభం నాటికే దేశంలో చాలా టీకాలు అందుబాటులోకి వచ్చాయని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు భారత ప్రతినిధి కె.నాగరాజు నాయుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీకాను అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడం, పంపిణీ చేయడం సవాల్‌‌గా మారిందన్నారు. ఈ విషయంలో సరైన అవగాహన లేకుంటే పేద దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని ఆయన పేర్కొన్నారు. కరోనాపై పోరులో భారత్‌ ఎప్పుడూ ముందుందని నాయుడు గుర్తుచేశారు. తొలి ఆరు నెలల కాలంలో భారత్‌లోని 30 కోట్ల మంది కరోనా వారియర్స్‌కు టీకా అందించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 70 దేశాలకు టీకా అందించామని నాగరాజు నాయుడు అన్నారు.