ప్రతి నియోజక వర్గంలో రూ.10 లక్షలతో బుక్ సెంటర్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రతి నియోజక వర్గంలో  రూ.10 లక్షలతో బుక్ సెంటర్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, వెలుగు : పుస్తక పఠనం, పుస్తకాల కొనుగోలును అలవాటు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రూ.10 లక్షలతో    బుక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.  గురువారం జిల్లా గ్రంథాలయంలో రూ.కోటితో నిర్మించిన పై అంతస్తును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించే బదులు బుక్ సెంటర్లలో పుస్తకాలు కొనుగోలు చేసి వాటిపై తమ పేరు రాసి గ్రంథాలయాలకు అందిస్తే పాఠకులకు చదివే ఆసక్తి పెరుగుతుందని అన్నారు.  

సాంస్కృతిక శాఖ ద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి రూ.1 కోటి నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్, మున్సిపల్ చైర్‌‌పర్సన్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

దళారులను నమ్మి  మోసపోవద్దు 

పెద్దకొత్తపల్లి :  దళారులతో రైతులు మోసపోవద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు  లో  వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్,గ్రామ ఉపసర్పంచ్ కురుమయ్య, గోపాల్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.