పంటలు అమ్మిన నెల రోజులైనా.. పైసల కోసం ఎదురుచూపులు

పంటలు అమ్మిన నెల రోజులైనా.. పైసల కోసం ఎదురుచూపులు
  •     పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొక్కజొన్న, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ చెల్లింపులు 
  •     సుమారు రెండు నెలలైనా రైతుల ఖాతాల్లోకి చేరని డబ్బులు 
  •     సిద్దిపేట జిల్లా రైతులకు మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించాల్సిన బకాయి 22.10 కోట్లు  

తొగుట మండలం తుక్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన చిక్కుడు చంద్రం మక్కజొన్న సాగు చేయగా 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల కింద తొగుట మార్కెట్ యార్డులోని కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మాడు. రూ.3.12 లక్షలు రావాల్సి ఉండగా నెలైనా డబ్బులు రాలేదు. దీనిపై అధికారులను అడిగినా సమాధానం చెప్పడం లేదని రైతు వాపోతున్నాడు. ఇది ఒక్క చిక్కుడు చంద్రం ఎదుర్కొంటున్న సమస్య కాదు జిల్లాలో మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మక్కజొన్న అమ్ముకున్న 4,252 మంది  రైతుల పరిస్థితి.


తొగుటకుచెందిన రైతు బండారి మల్లేశం రెండకరాల్లో సన్ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగుచేయగా 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెల రోజుల కింద తొగుట మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంటను అమ్మగా రూ. 92,652 రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఖాతాలో డబ్బులు పడలేదు. మార్క్ ఫెడ్ అధికారులను సంప్రదిస్తే నిధులు విడుదల కాగానే ఖాతాలోకి జమ అవుతాయని చెప్పారు. 


సిద్దిపేట, వెలుగు: కష్టనష్టాలకోర్చి పండించిన పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పకపోగా.. పంట అమ్మినంక రైతులకు పైసలు పడక అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మక్కజొన్న, సన్ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగు చేసిన రైతులు తమ ఉత్పత్తులను మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మారు. జిల్లాలో సుమారు 6,020 మంది రైతులు కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ పంటలు అమ్మగా వీటికి సంబంధించి రూ.22.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

17,200 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నల కొనుగోలు

సిద్దిపేట జిల్లాలో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేయగా దాదాపు 45 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గత మార్చి 18న జిల్లాలోని సిద్దిపేట, చేర్యాల, బెజ్జంకి, అల్లీపూర్, గజ్వేల్, హుస్నాబాద్, నంగునూరు, మిరుదొడ్డి, కాన్గల్, తొగుట, దుబ్బాక, అక్బర్ పేట, గుడికందుల, జగదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, వడ్లూరు, కట్కూరులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2,400 మద్దతు ధరతో మక్కలు కొనుగోలు చేశారు. ఏప్రిల్ మొదటి వారం దాకా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 4,252 మంది రైతుల నుంచి 17,200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. రూ.4.12 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. 

సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైతులకు రూ.17.98కోట్లు పెండింగ్​

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిద్దిపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో సన్ ఫ్లవర్ సాగుచేయగా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. క్వింటాల్ సన్ ఫ్లవర్ కు మద్దతు ధర రూ.7,721 ప్రకారం మార్క్ ఫెడ్ కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన 10 రోజుల్లోనే 1,768 మంది రైతుల నుంచి 2,239 వేల మెట్రిక్ టన్నుల సన్ ఫ్లవర్ ను మార్క్ ఫెడ్ కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి రూ.17.98 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. మక్కజొన్న, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిల్వలు భారీగా పేరుకుపోవడంతో యార్డులో స్థలం కొరత ఏర్పడింది. మరోవైపు ధాన్యం భారీగా వస్తుండగా స్థలం కొరతతో యార్డును మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

వారం రోజుల్లో  రైతులకు చెల్లింపులు

జిల్లాలో మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మక్కజొన్న, సన్ ఫ్లవర్ కొనుగోలు చేశారు. వారం రోజుల్లో రైతులకు చెల్లింపులు పూర్తి చేస్తాం. సుమారు 22.10 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్యాంక్ గ్యారంటీ ఆలస్యం కావడం వల్ల సకాలంలో రైతులకు చెల్లింపులు చేయలేక పోయాం. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
-సునీత, డీఎం మార్క్ ఫెడ్, సిద్దిపేట.