బాల్కొండ, వెలుగు: ప్రజాపాలన ప్రగతి నివేదిక, మహిళా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్జిల్లా బాల్కొండలో శుక్రవారం మహిళా సంఘాలకు రుణ మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ద్వారా 33 స్వయం సహాయక సంఘాలకు రూ.3 కోట్ల రుణాల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు.
బాల్కొండ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 19 సంఘాలకు రూ.1.55 కోట్లు వన్నెల్ (బి) ఎస్‌బీఐ ద్వారా 8 సంఘాలకు రూ.80 లక్షలు, 6 సంఘాలకు ఇతర బ్యాంకులు రూ.65 లక్షలు మంజూరు చేశాయి. మహిళలకు ఈ రుణాలు ఎంతో ఉపయోగపడతాయని ఏపీఎం గంగారాం తెలిపారు. కార్యక్రమంలో యూబీఐ మేనేజర్ గణేశ్, ఎస్‌బీఐ వన్నెల్-(బి) మేనేజర్ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
