సత్తుపల్లి, వెలుగు : రూ.4.51 కోట్ల విలువైన షావెల్ యంత్రాన్ని ఓపెన్ కాస్ట్ ల జనరల్ మేనేజర్ డీవీఎస్ సూర్యనారాయణరాజు, జీఎం చింతల శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్పత్తిలో సింగరేణి సంస్థ కే తలమానికమైన జేవీఆర్ ఓసీలో 6.5 క్యుబిక్ మీటర్లు సామర్థం గల అత్యాధునిక షావెల్ యంత్రం చాలా అవసరమన్నారు.
సింగరేణిలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ షావెల్స్ వినియోగం ద్వారానే సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పీవో ప్రహ్లాద్, ఏరియా ఇంజినీర్ సూర్యనారాయణరాజు, సూపరింటెండెంట్ అఫ్ మైన్స్ రాజేశ్వరరావు, ప్రాజెక్ట్ ఇంజినీర్ శ్రీనివాసరావు, మేనేజర్ (ఆపరేషన్స్) కల్యాణ్ రామ్, వెల్ఫేర్ ఆఫీసర్ దేవదాస్, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
