Beauty Tip : గోళ్లు ఆరోగ్యంగా.. అందంగా ఉండాలంటే ఇలా చేయండి..!

Beauty Tip : గోళ్లు ఆరోగ్యంగా.. అందంగా ఉండాలంటే ఇలా చేయండి..!

గోళ్లకు రంగు వేసుకుంటాం... నచ్చినట్లుగా పెంచుకుంటాం.. ఏవేవో నెయిల్ ఆర్ట్స్ టై చేస్తుంటాం. ఇవన్నీ గోళ్లకు కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. మరి అందాన్నిచ్చే గోళ్లను ఆరోగ్యంగా ఉంచాలంటే ఏం చేయాలో చూద్దామా..

గోళ్లు తడిగా ఉన్నప్పుడు క్రిములు, బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి పనులు చేశాక, తడి పోయేలా తుడుచుకోవాలి. చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. గోళ్లకు లాలాజలం తగలడం వల్ల బల హీనపడి, చిట్లినట్లు అవుతాయి. గోటి చుట్టూ ఉండే చర్మానికి కూడా మంచిది కాదు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా.. గోళ్లు కొరక్కూడదు.

గోళ్లు పొడిబారి నప్పుడు కూడా అవి విరిగిపో తుంటాయి. అందుకే చేతులకే కాదు, గోళ్లకు కూడా నాణ్యమైన మాయిశ్చరైజర్ని రాసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు అలివ్ నూనెతో మసాజ్ కూడా చేస్తుం దాలి. అలాగే గోళ్ల రంగుల్లో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. అది గోళ్లకేకాదు, చుట్టూ ఉన్న చర్మానికి కూడా హాని చేస్తుంది. అందుకే నాణ్యమైన గోళ్ల రంగులనే ఎంచుకోవాలి.