Good Health : శరీరంలోని వీటినీ పట్టించుకోవాలి.. లేకపోతే చాలా అనారోగ్యం

Good Health : శరీరంలోని వీటినీ పట్టించుకోవాలి.. లేకపోతే చాలా అనారోగ్యం

శరీరంలో నెగ్లెక్ట్ చేసే బాడీ పార్ట్స్ కొన్ని ఉన్నాయి. 'లేదు లేదు, బయటికెళ్లొచ్చిన వెంటనే ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుంటున్నాం' అంటారా? నిజమే.. కానీ, అక్కడే ఒక పొరపాటు కూడా చేస్తుంటారు చాలామంది. వాటితోపాటు మెడ, మోచేతులు, మోకాళ్లు, బాహుమూలలు వంటివి శుభ్రం చేసుకోకుండా వదిలేస్తారు. అలా పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో మురికి చేరి, పేరుకుపోతుంది. అవి నల్లగా మారడానికి ఈ నిర్లక్ష్యమే ప్రధాన కారణం.

బయటికెళ్లి వచ్చినప్పుడే కాదు, ఇంట్లో సరే.. అవయవాలన్నింటి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. అప్పుడే అవి సరిగా పనిచేస్తాయి. లేదంటే రియాక్షన్ చూపిస్తాయి. శరీరంలో ఈ భాగాలను పట్టించుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు సీరియస్ అవ్వొచ్చు కూడా. అందుకే వాటి గురించి జాగ్రత్త తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. ఉంటాయంటున్నారు డెర్మటాలజిస్ట్లు. మరి ఆ జాగ్రత్తలేంటంటే...

మోకాళ్లు, మోచేతులు

మోకాళ్లు, మోచేతులు సరైన షేప్ లో ఉండాలంటే ఎక్సర్సైజ్ కచ్చితంగా చేయాలి. అలాంటప్పుడు శరీర బరువు మొత్తం మోచేతులు, మోకాళ్లపై పడుతుంటుంది. ఎక్సర్ సైజ్లు చేసేటప్పుడు రాపిడి వల్ల మోకాలు, మోచేతుల మీద ఉండే స్కిన్ నల్లగా, మందంగా, పొడిబారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెత్తటి మ్యాట్ వాడాలి. అప్పుడు రాపిడి తగ్గి, చర్మం గట్టిపడదు. నల్లగా కూడా మారదు. రాత్రిళ్లు పడుకునే ముందు మోకాళ్లకు మాయిశ్చరైజర్ రాస్తుంటారు కొందరు. లాక్టిక్ యాసిడ్ లేదా యూరియా ఉండే మాయిశ్చరైజర్ లు వాడితే మంచిది. దాంతోపాటు వారానికొకసారి స్క్రబ్ చేస్తుండాలి.

వేలి కణుపులు

వేలి కణుపులను ఇంగ్లీష్లో నకెల్స్ అంటారు. యూరియాతో తయారుచేసిన మాయిశ్చరైజర్ వాడాలి. దాంతోపాటు వారానికొకసారి స్క్రబ్ చేయాలి. చేతులు కడుక్కునేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. అలా దుర్చితే స్కిన్ డ్రై అయిపోతుంది. నకెల్స్ నల్లగా మారతాయి. 

బాహుమూలలు

ఎప్పటికప్పుడు హెయిర్ రిమూవ్ చేయాలి. చెమట రాకుండా, సువాసనలు లేని యాంటీ పర్స్పెరెంట్ వాడాలి. దానివల్ల అక్కడి చర్మం నల్లగా మారదు. ఎలాంటి అలెర్జీలు రావు. ఏవైనా ప్రొడక్ట్స్ వాడినప్పుడు అలెర్జీలు వస్తే. రెటినాల్ కలిసి ఉండే అండర్ ఆర్మ్ క్రీమిని ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు అప్లై చేయాలి. అలా చేయడం వల్ల అక్కడ ఉన్న స్కిన్ క్లీన్ అయిపోయి, నల్లగా మారదు. 

తొడలు

ఈ ప్రాంతంలో ఎక్కువగా చెమట పడుతుంది. దానివల్ల ఆ ప్రాంతంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్సర్సైజ్ లు చేసేటప్పుడు టాల్కం ఫ్రీ పౌడర్ వాడాలి. ఎక్సర్సైజ్ చేయడం పూర్తైన వెంటనే స్నానం చేయాలి. సింథటిక్ అండర్ గార్మెంట్స్ వాడొద్దు. అవి వాడటం వల్ల ఇరిటేషన్, అలెర్జీలు, రాషెస్ వస్తాయి.

నాభి

నాభిని సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల తేమ ఉండిపోయి, అక్కడ మురికి చేరుతుంది. స్నానం తర్వాత కచ్చితంగా నాభిని మెత్తటి క్లాత్ లేదా టిష్యూతో శుభ్రంచేయాలి.

కాళ్లు

ప్రతిరోజు రాత్రిపూట కాళ్లకు క్రీమ్ వాడాలి. కాళ్లకు ఎప్పుడూ గాలి తగిలేలా ఉండాలి. సాక్స్ లు ఎప్పుడూ కాళ్లకు వేసుకుని ఉండొద్దు. టైట్ గా ఉండే చెప్పులు లేదా షూస్ వాడొద్దు. టైట్ గా వేసుకుంటే కాలివేళ్ల మధ్య గ్యాప్ ఉండదు. దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాలిగోర్లు పెరిగినప్పుడల్లా కత్తిరిస్తుండాలి. చెప్పులు, షూస్ సరిగ్గా కాలికి సరిపోవాలి. మెత్తగా ఉండాలి. అప్పుడే కాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.

మెడ

చాలాసార్లు ముఖం కడుగుతారు. కానీ, మెడ మాత్రం కడగరు. అలా వదిలేయడం వల్ల అక్కడ డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువై పోతాయి. అందుకని, ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా మెడ కడగాలి. అంతేకాకుండా వారానికొకసారి నేచురల్ స్క్రబ్తో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్లకు మెడ మీద
ఎక్కువ భారం పడుతుంది. దానివల్ల మెడ నల్లగా మారుతుంది. అందుకని మెడ మీద ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చేయాలి. అప్పుడు మెడ మళ్లీ నార్మల్ స్కిన్ కలర్ లోకి వచ్చేస్తుంది.