భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి బుధవారం కూనవరం రోడ్డులోని ఎంవీఐ ఆఫీస్వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ కారు, స్కూటీ అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఆపి తనిఖీ చేయగా 14.6 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.
సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన షేక్మస్తాన్, తిరుమలగిరికి చెందిన మహమ్మద్ఇఫ్తాకర్, కందిబండకు చెందిన తోటపల్లి గోపి, తోటపల్లి దిశ్వంత్రెడ్డి, సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లికి చెందిన నీర్ల అంజనీకుమార్ఒడిశాలోని కలిమెలలో గంజాయి కొనుగోలు చేసి, సూర్యాపేట, హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్సై తెలిపారు. ఐదుగురు నిందితులతోపాటు గంజాయి, కారు, బైక్, 5 సెల్ఫోన్లను భద్రాచలం ఎక్సైజ్స్టేషన్లో అప్పగించారు. హెడ్ కానిస్టేబుళ్లు ఎంఏ.కరీం, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్వీరబాబు పాల్గొన్నారు.
