- సీఎంకు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ సవాల్
హైదరాబాద్, వెలుగు: గత 13 ఏండ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు రూ. 13 లక్షల కోట్ల నిధులు అందించిందని, ఏ పద్దు కింద, ఏ జీవో ద్వారా ఎంత నిధులు విడుదలయ్యాయో లెక్కలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఒప్పించి బహిరంగ చర్చకు తీసుకొస్తామని, దీనికి సీఎం సిద్ధమా అని సవాల్ విసిరారు.
మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తమ పనులు చక్కబెట్టుకుంటున్న సీఎం, బయటకు వచ్చి మాత్రం కేంద్రంపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సోమవారం కరీంనగర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనకు వచ్చిన ప్రజాదరణ చూసి కాంగ్రెస్ మంత్రులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.
