- ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇందిరా పార్కు దగ్గర ధర్నా
ముషీరాబాద్,వెలుగు : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చేతన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆధ్వర్యంలో విదేశీ వైద్య విద్యార్థుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
దీనికి హాజరైన చేతన్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన వైద్య విద్యార్థులకు ఇండియాలో ఎంబీబీఎస్పూర్తి చేసిన విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ ఎంబీబీఎస్పూర్తి చేసిన వారికి రూ.29 వేలు, విదేశౄల్లో చేసిన వారికి రూ. 5 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఒకే రకమైన విద్యార్హతలు కలిగి, వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రకమైన క్లినికల్ విధులు నిర్వహిస్తున్నా కూడా వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులు జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
