కేయూ కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్ల చాక్‌‌‌‌డౌన్‌‌‌‌..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 

కేయూ  కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్ల చాక్‌‌‌‌డౌన్‌‌‌‌..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 

గ్రేటర్​ వరంగల్, వెలుగు: వరంగల్‌‌‌‌ కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లు శుక్రవారం చాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నిరసన తెలిపారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పి.రామచంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. రెగ్యులర్‌‌‌‌ నియామకాలకు ముందే 30 ఏండ్లకు పైగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఉద్యోగ భద్రతతో పాటు యూజీసీ పే స్కేల్‌‌‌‌ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తమ విభాగాల్లో తరగతులు బోధించకుండా చాక్‌‌‌‌డౌన్‌‌‌‌ నిర్వహించారు. అనంతరం కేయూ పరిపాలన భవనం ఎదుట నినాదాలు చేశారు. రిజిస్ట్రార్‌‌‌‌తో సమావేశమై సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కేయూ అసిస్టెంట్‌‌‌‌ గ్రూప్స్‌‌‌‌ జేఏసీ చైర్మన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ పి.కరుణాకర్‌‌‌‌రావు, టీఆక్ట (టీఏయూసీటీఏ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌‌‌‌ శ్రీధర్‌‌‌‌కుమార్‌‌‌‌ లోద్‌‌‌‌, జేఏసీ కన్వీనర్‌‌‌‌ సాధు రాజేశ్‌‌‌‌తో పాటు పలువురు కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.