ఘోరం అంటే మరీ ఘోరం.. క్రైం చేయటంలోనూ మరో లెవల్ చూపిస్తున్నారు ఈ తరం లేడీస్.. ముంబై సిటీలో జరిగిన ఓ క్రైం చూసిన పోలీసులే షాక్ అయ్యారు. ఇలాంటి ఆలోచనలు లేడీస్ ఎలా వస్తున్నాయంటూ నోరెళ్లబెట్టారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ మహిళ.. భర్త ఉండగానే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అతనికీ పెళ్లయ్యింది. భార్యను వదిలేసి నన్ను పెళ్లి చేసుకో.. నా పిల్లలను వదిలేసి నేనే వచ్చేస్తా అంటూ బలవంతం పెట్టింది. ఆ వ్యక్తి నో చెప్పటం.. న్యూ ఇయర్ రోజు.. పార్టీ ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి.. ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసింది ఆ మహిళ.. అత్యంత ఘోరంగా జరిగిన ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....
ముంబైలోని శాంతాక్రూజ్ లో ఉండే ఇద్దరు పిల్లలు ఉన్న ఓ 25 ఏళ్ల మహిళకు, 42 ఎల్లా వ్యక్తితో గత ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె అతన్ని తనని పెళ్లి చేసుకోవాలని, అతని భార్యకు విడాకులు ఇచ్చి తనతోనే ఉండాలని ఎప్పుడు గొడవ పడేది. అయితే, బాధితుడు మాత్రం తన భార్యను వదిలేయడానికి ఒప్పుకోలేదు.
ఈ విషయంలో గొడవలు రోజురోజుకు పెరగడంతో కొన్నాళ్ల క్రితం ఆ మహిళ బీహార్‌లోని తన సొంత ఊరికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి అతడిని బెదిరిస్తూ ఉండేది. డిసెంబర్ 19న ఆమె తిరిగి ముంబైకి వచ్చింది. డిసెంబర్ 24న అతను ఆమెను కలిసి పరిస్థితిని అర్థం చేసుకో, మనకు కుటుంబాలు ఉన్నాయి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
చివరికి జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్న్ జరుపుకుందాం.. స్వీట్లు తినడానికి రా అని ఆమె అతడిని ఇంటికి పిలిచింది. గదిలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్న టైంలో వారి మధ్య మళ్లీ పెళ్లి విషయం పై గొడవ జరిగింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా ఆమె పదునైన ఆయుధంతో ఒక్కసారిగా అతని మర్మాంగంపై దాడి చేసింది.
తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని అతని కొడుకు, సోదరుడికి సమాచారం ఇచ్చాడు. వాళ్ళు వెంటనే అతడిని వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సియోన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి సర్జరీ జరిగిందని, కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. దాడి చేసిన తర్వాత ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడి నుండి పరారైంది. పోలీసులు ఆమెపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
